వీరపునాయునిపల్లి: అప్పుల బాధతో డీలర్ ఆత్మహత్య

వీరపునాయునిపల్లి మండలం ఎన్. పాలగిరి గ్రామానికి చెందిన జగదీష్ (40) అనే డీలర్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు పది రోజుల క్రితం అప్పుల బాధతో జగదీష్ విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కడప రిమ్స్ లో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.