ఖాజీపేట పంచాయతీ పరిధిలో ఉన్న పేరరెడ్డి కొట్టాల గ్రామానికి నీటి సరఫరా కోసం గ్రామస్తులు ఇంటికి 2, 000 చొప్పున చందా వేసుకుని సొంత బోరు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ. జాతీయ రహదారి అనుకుని ఉన్నామే గాని మా నీటి సమస్య తీర్చడంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని అందువలన చేసేది ఏమీలేక సమస్యను మేమే పరిష్కరించుకున్నామని గ్రామస్తులు తెలిపారు.