మదనపల్లి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామసముద్రం మండలం కేసి పల్లి గ్రామానికి చెందిన జయరాం (45) గురువారం భవన నిర్మాణ పనులు చేయడానికి మదనపల్లి పట్టణంలోకి బైకు పై వెళుతుండగా మరో బైక్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయరాం ను వెంటనే మదనపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.