కురబలకోట మండలంలో అంగళ్ళు కు చెందిన ఎల్లప్ప కుమారుడు రెడ్డప్ప భవన నిర్మాణం పనులు చేస్తున్నాడు. ఇటీవల తండ్రి ఎల్లప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యాడు. తండ్రి పైన బెంగతో శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.