పిల్లల విషయంలో గొడవ తలెత్తడంతో, మహిళ పై ఓ కౌన్సిలర్ దాడిచేసిన సంఘటన శనివారం ఉదయం మదనపల్లెలో వెలుగు చూసింది. బాదితురాలి కథనం మేరకు స్థానిక చలపతి రావు కాలనీ ఆంజనేయస్వామి గుడి వీధిలో కాపురం ఉండే ఫయాజ్, ఆయేష భాను పిల్లల పై ఎవరో నీళ్లు చల్లడంతో ఆయేషభాను నిలదీసింది. మమ్మల్నే తిడుతున్నారని కౌన్సిలర్ సలీం మరికొందరు ఆయేష భాను ఇంట్లోకి చొరబడి కొట్టినట్లు బాధితురాలు ఆరోపించింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.