మదనపల్లి మండలం బసినికొండలో మంగళవారం రాత్రి కోడలి పై అత్త, ఆడబిడ్డ దాడి చేసి గాయపరిచారు. ఘటనపై బాధితురాలు తెలిపిన వివరాల మేరకు బసినికొండలో కాపురం ఉంటున్న హేమావతి (22) ని ఆమె అత్త ఈశ్వరమ్మ, ఆడబిడ్డ శంకరమ్మ దాడి చేసి గాయపరిచారు. బాధితురాలిని స్థానికులు చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల వైద్యం అందిస్తున్నారు.