మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి స్నేహితునిపై కత్తితో దాడి చేసినట్లు మదనపల్లె వన్ టౌన్ సిఐ ఎరిసా వలి తెలిపారు. ఈశ్వరమ్మ కాలనీలో ఉండే నారాయణ (42) వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటరమణ స్వామి ని దర్శించుకుని రాగి మాను వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న స్నేహితుడు జగదీష్ మద్యం కొరకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. డబ్బు ఇవ్వలేను అని చెప్పడంతో కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.