మదనపల్లె: అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం

31చూసినవారు
మదనపల్లె: అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం
డియర్ మమ్మీ.. డాడీ.. ఇక నా వల్లకాదు చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ తిరుమలలో లభించిందని ఎస్ఐ గాయత్రి ఆదివారం తెలిపారు. మదనపల్లెలోని ఫార్మసి విద్యార్థిని శ్వేత శ్రీచంద్రను కళాశాల నిర్వాహకులు ఫీజు కోసం వేధించారని పీటీఎం పట్టెంవాండ్లపల్లి సుజాత, సూర్యనారాయణలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థిని ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్