మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు ఏపీఐఐసి చట్టాలకి విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆఫ్ 20 ప్రిన్సిపుల్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ లంక దినకర్ కి బుధవారం బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు పరిశ్రమల కోసం స్థలాలు తీసుకొని, ఇతర వ్యాపారాల కోసం అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు.