రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడినట్లు మదనపల్లి వన్ టౌన్ ఎస్ఐ ఆన్సర్ బాషా తెలిపారు. మదనపల్లి ఏసీ గోడౌన్ పక్కన ఉంటున్న బుడన్ సాబ్ (70) శనివారం కురబలకోట నుంచి వచ్చి రోడ్డు దాటడం కొరకు రోడ్డు ప్రక్కన వేచి ఉండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడి కాలు విరిగిన వృద్ధుడిని స్థానికులు మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.