రామసముద్రం: ఆర్మీ జవాన్ వివాదాస్పద భూమిని పరిశీలించిన

83చూసినవారు
రామసముద్రం మండలంలోని చిట్టెం వారి పల్లెకు చెందిన ఆర్మీ జవాన్ మోహన్ కుటుంబానికి చెందిన వివాదాస్పద భూమిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా మంగళవారం పరిశీలించారు. ఇందుకు సంబంధించి రికార్డులను తహసీల్దార్ నిర్మలాదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల వాదనలు విన్న ఎమ్మెల్యే వివాదాస్పద భూమికి సంబంధించిన మొత్తం భూమిని సర్వేచేసి రెండు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్