వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డెయిరీ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గండబోయుని పల్లికి చెందిన రెడ్డిశేఖర్ చింతపర్తి సమీపంలోని పాల డెయిరీలో పని చేస్తాడు. షిఫ్ట్ ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.