బ్రహ్మంగారిమఠం: పేదలకు భూములు మంజూరు చేయాలి: సిపిఐ

64చూసినవారు
బ్రహ్మంగారిమఠం: పేదలకు భూములు మంజూరు చేయాలి: సిపిఐ
సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలంలోని డిప్యూటీ తహశీల్దార్ కి సిపిఐ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల నాయకులు పెద్దులపల్లి ప్రభాకర్, సీనియర్ నాయకులు నారాయణ మాట్లాడుతూ.. మండలంలోని పేదలందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం, మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. సచివాలయం సిబ్బందితో కమిటీ వేసి భూమిలేని పేదలను గుర్తించి భూములు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్