విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా మైదుకూరు మండలంలోని సుంకులుగారిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలకు మంగళవారం ఉప్పుగుంటపల్లెకు చెందిన తెదేపా నాయకుడు కృష్ణ కిశోర్ యాదవ్ రూ. 10 వేల విలువైన దేశనాయకుల చిత్రపటాలు అందజేశారు. కృష్ణ కిశోర్ తరపున ఆయన అనుచరులు చిత్రపటాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మీ దేవికి అందజేశారు. అనంతరం విద్యార్థులకు భోజనం అందించారు. ఉపాధ్యాయులు వరలక్ష్మి, వాహీదా పాల్గొన్నారు.