అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మైదుకూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలoటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసులకు అర్జి ఇచ్చి వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని అలా కాని పక్షములో చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని డిఎస్పీ తెలిపారు.