బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామంలో వెలసి ఉన్న జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠంను మంగళవారం కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాదు దర్శించుకున్నారు. దర్శనానంతరం జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర శివకుమారస్వాములవారిని కలిసి మఠం అభివృద్ది విషయమై చర్చించారు.