విఆర్‌ఏ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వెంటనే చొరవచూపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రైల్వే కోడూరు తహసిల్దార్ కు మంగళవారం సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం ₹ 10500 లతో బ్రతకలేక విఆర్‌ఏ ల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.