మైదుకూరు: వెలుగులోకి 16వ శతాబ్దం నాటి వీరగల్లు

60చూసినవారు
మైదుకూరు: వెలుగులోకి 16వ శతాబ్దం నాటి వీరగల్లు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లి గ్రామంలో 16 శతాబ్దం కాలంనాటి వీరగల్లును వెలుగులోకి తెచ్చినట్టు రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ మంగళవారం తెలిపారు. వీరగల్లు విగ్రహంలో వీరుడు కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో సంగీత వాయిద్య పరికరాన్ని పట్టుకొన్నట్లు ఉందని తెలిపారు. విగ్రహం పై భాగంలో కొన్ని జంతువులు చిత్రీకరించబడ్డాయన్నారు.

సంబంధిత పోస్ట్