మైదుకూరు ఎస్సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పనుల ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఈవో మైథిలి, బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ పాల్గొన్నారు. రూ. 12. 98 కోట్లతో 228 పనులను ప్రారంభించారు. ఎంపీడీవో శ్రీధర్ నాయుడు, కమిషనర్ శ్రీనివాసులురెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.