ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలపై అవగాహన కలిగి ఉండాలని మైదుకూరు పట్టణ సిఐ కే. రమణారెడ్డి సూచించారు. శనివారం మైదుకూరు పట్టణ శివారులోని మేధా డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ లో వాకర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు సీసీ కెమెరాలు ఆవశ్యకతను తెలుసుకొని తమ గృహాలకు, దుకాణాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు.