ఈనెల 13, 14 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన 3వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్, సీనియర్ జిల్లా లాక్రోస్ చాంపియన్షిప్ 2025-2026 నందు మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించారు. మంగళవారం పాఠశాల సందర్శనకు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి షoశుద్దీన్ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులను, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.