మైదుకూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆదివారం ఉదయం 9:30కి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని డిస్కం ఉపాధ్యక్షులు శీలం సుబ్బరాయుడు కోరారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఎల్స్‌ను చెల్లించాలి, జూనియర్ లైన్‌మెన్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, అపరిమిత మెడికల్ పాలసీ అమలు చేయాలన్నారు.