మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష పడినట్లు మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్బారావు మంగళవారం తెలిపారు. పెద్దమడియం మహమ్మద్ బషీర్ అహమ్మద్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడపడంతో అతని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మైదుకూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రూ.2 వేలు జరిమానా, ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ తెలిపారు.