రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం మైదుకూరు పట్టణం కడప రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఎమ్మార్పీఎస్, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.