ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని మైదుకూరు పట్టణ సీఐ కే రమణారెడ్డి సూచించారు. గురువారం రాత్రి మైదుకూరు మండలం జీవి సత్రం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజలకు దొంగతనాలు, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ ఫై అవగాహన కలిగి ఉంటే సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలన్నారు.