మైదుకూరు: ప్రవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు

80చూసినవారు
మైదుకూరు: ప్రవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు
మాదకద్రవ్యాల అక్రమ నివారణలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం నుండి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను, ట్రాన్స్ పోర్ట్ వాహనాలను మైదుకూరు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున తనిఖీ చేశారు. సిఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బస్సులోని ప్రతి పార్సిల్ ను, అనుమానస్పద బ్యాగులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాలు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్