నందికొట్కూరులోని అలగనూరు ప్రాజెక్టును ఆదివారం ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, జయసూర్య కలిసి సందర్శించారు. 2.95 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన 700 మీటర్ల కట్ట బలహీనంగా మారడంతో నీరు నిల్వ చేయలేకపోతున్నట్లు తెలిపారు. రూ.36 కోట్లతో మరమ్మతులు చేసి రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.