గుంటూరులో ఈనెల 14, 15 వ తేదీలలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 11వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి సుబ్బరాజా తెలిపారు. మంగళవారం పోరుమామిళ్ల సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2007లో అనేక పోరాటాలు చేసి 7200 మంది కాంట్రాక్ట్ కార్మికులను చేయడంలో సిఐటియు కీలకపాత్ర పోషించిందన్నారు.