పోరుమామిళ్ల మండలం వెంకటాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రామాంజనేయులు ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ మేరకు పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథరెడ్డి రామాంజనేయులు కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ వచ్చేందుకు జిల్లా అధికారులతో మాట్లాడి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.