రామసముద్రం మండల నూతన ఎస్సైగా డి. రమేశ్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాయచోటి స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహించి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఉన్న ఎస్సై రవికుమార్ రాయచోటి వీఆర్ కు బదిలీ అయ్యారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని, ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తానని తెలిపారు.