ప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ రద్దు చేయండి: ఫ్యాప్టో

51చూసినవారు
ప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ రద్దు చేయండి: ఫ్యాప్టో
ఖాజీపేట ఉన్నత పాఠశాలలో కలుషితమైన నీరు త్రాగి విద్యార్థులు అస్వస్థతకు గురైనారనే కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. ఉమాదేవి పై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయాలని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర గౌడ్ ను కలిసి ఫ్యాప్టో ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్