మండల కేంద్రంలోని సోమిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ లో సర్వే నెం.464లో 10.5 ఎకరాల శ్మశాన స్థలా నికి భూకబ్జాదారుల నుంచి విముక్తి లభించింది. ఇటీవల మైదుకూరు పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు జిల్లా కలెక్టర్ దృష్టికి జనచైతన్య సంస్థ నాయకుడు తిప్పన బాలనాయుడుతో పాటు గ్రామ ప్రజలు తీసుకునివె ళ్లారు. పోలేర మ్మనగర్ తదితర చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజ లు తరలివచ్చి భూక బ్జాకు గురైన స్థలాన్ని ఎక్స్‌కవేటర్ ద్వారా చదను చేయించారు.