దువ్వూరు మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మూడు రోడ్ల కూడలి నుంచి ఎస్బిఐ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిలో ఉన్న మహాత్మా గాంధీ, అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ శ్యామ్, అసిస్టెంట్ మేనేజర్ తారీకేశ్వరి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.