ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పండగ జరుపుకోవాలి: డీఎస్పీ

73చూసినవారు
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పండగ జరుపుకోవాలి: డీఎస్పీ
మైదుకూరు డిఎస్పి వారి కార్యాలయంలో బుధవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వినాయక చవితి పండగ జరుపుకోవాలని అన్నారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరగకుండా నిమజ్జనం రోజు ఎలాంటి సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు సిఐ హాసం, ఎస్ఐ ఉన్నారు.

సంబంధిత పోస్ట్