గుర్రంకొండ: పశువులకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

85చూసినవారు
గుర్రంకొండ: పశువులకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగా పశువులకు వడదెబ్బ తగలకుండా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్రంకొండ పశు వైద్యాధికారి సునీల్ నాయక్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, పశువులను మేత కోసం ఎండలో ఎక్కువగా తిప్ప కూడదు అన్నారు. ఉదయం, సాయంత్రం వేళలలో మాత్రమే పశువులను మేపడానికి తీసుకెళ్లాలని అన్నారు. వర్షం పడుతున్న సమయాలలో చెట్ల కింద పశువులను కట్టివేయరాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్