గుర్రంకొండ: పోలీసులపై రెచ్చిపోయిన యువకులు

84చూసినవారు
పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం గేరికుంటపల్లిలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా చాందిని బండి యజమానులు రికార్డింగ్ డాన్సులకు బుధవారం అనుమతి లేకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి రికార్డింగ్ డాన్సులు అడ్డుకున్నారు. దీంతో కొంత మంది యువకులు వెంటనే పోలీసులపై రెచ్చిపోయి పోలీస్ వాహనం ధ్వంసం చేశారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు చాకచక్యంగా గొడవలను అదుపులోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్