పీలేరు మండలం దొడ్డిపల్లి గ్రామం ఎగువ హరిజనవాడలో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఆరుమడకల సుబ్రహ్మణ్యం (55) సమీపంలోని చింతలచెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. నీటమునిగిన సమయంల కాళ్లకు వళ చుట్టుకుని మునిగిపోయాడు. స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.