మోటారు బైక్ ఢీకొని రోడ్డు పక్కన నిలబడిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం కలికిరికి చెందిన శ్రీనాథ్ (24), చింతమాకుల పల్లెకు చెందిన భార్గవ్ (29) సొంత పనిమీద వచ్చి సర్కారు తోపు వద్ద నిలబడి ఉండగా గుర్తుతెలియని మోటారు బైకుబైక్ ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన ఇద్దరిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.