ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యచేసుకున్న సంఘటన శనివారం రాత్రి పీలేరు పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది. స్థానికుల వివరాలు మేరకు. రాజీవ్నగర్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ యమహా షోరూంలో పని చేస్తున్నాడు. తరచూ బంధువులతో గొడవపడేవాడని చుట్టుపక్కల ఉన్న స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన నివాసంలో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు.