బద్వేల్: బీజేపీ క్రియాశీలక సభ్యత్వాలపై సమావేశం

58చూసినవారు
బద్వేల్: బీజేపీ క్రియాశీలక సభ్యత్వాలపై సమావేశం
కడప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ సంఘటన పర్వ్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కడప ఇన్చార్జి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లో బిజెపి క్రియాశీలక సభ్యత్వంపై వివరించారు. బద్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ సభ్యత్వ నమోదు సంఖ్యను పెంచాలని నేతలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్