ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వంశీ రెడ్డిపై ప్రొద్దుటూరు 2 టౌన్ పీసీలో శనివారం రాజేశ్ ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా గతంలో కూడా చాలా పోస్టులు పెట్టారని మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామనూరు రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సదాశివయ్య తెలిపారు.