ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్‌లో గురువారం సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని పట్టణ కార్యదర్శి సత్యనారాయణ ఆరోపించారు. అమరావతి, పోలవరం బయట ఇతర ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.