ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన మురికి కాలువల్లో రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు పూడికతీత పనులను చేపట్టారు. మంగళవారం మడూరు కాలువలో జేసీబీతో సిబ్బంది పూడికను తొలగిస్తున్నారు. శ్రీనివాస నగర్ లో కాలువలో పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పర్యవేక్షించారు. కాలువల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని తెలిపారు.