ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ధృతరాష్ట్రుడి పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు విస్తరణలో సర్పంచ్ శివచంద్రారెడ్డి కాంప్లెక్స్ తొలగించకుండా పేదల గదులను ఎలా తొలగిస్తారన్నారు. ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి, సర్పంచ్ వ్యాపారుల నుంచి రూ.కోట్ల వసూలు చేశారన్నారు.