మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

66చూసినవారు
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
మైనర్లకు బైక్ లు ఇవ్వడం ప్రమాదకరమని ట్రాఫిక్ సీఐ యుగంధర్ తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో బుధవారం మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ నడుపుతున్న మైనర్ పిల్లల వారి తల్లిదండ్రులను పిలిపించి సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు బైక్ నడుపుతూ ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు నిందితులు అవుతారని హెచ్చరించారు. పట్టుబడిన వారికి మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు.

సంబంధిత పోస్ట్