సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి మందలించడంతో తనయుడు దాసరి పవన్ కుమార్ (20) బుధవారం ఫ్యాన్ కు ఉరి
వేసుకున్న ఘటన బుధవారం ఎర్రగుంట్లలో చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్ లో నివాసం ఉండే దాసరి సుధాకర్ చిన్న కుమారుడు ప్రొద్దుటూరు శివార్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని మంగళవారం రాత్రి తండ్రి మందలించాడు. ఉదయం చూసే సరికి ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదైంది.