ప్రొద్దుటూరు స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా చండీహోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం లోకకల్యాణార్థం వేద పండితులు గణపతి, నవగ్రహ, ఉపదేవతా చండీహోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.