ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వంశీ రెడ్డిపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఆయన అసాంఘిక కార్యకలాపాల్లో ఉన్నారంటూ పోస్ట్ చేసిన ఘటనపై కామనూరు రాజేశ్ శనివారం ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంతకు ముందు కూడా ప్రభుత్వాన్ని దూషించేలా పోస్టులు చేశాడని మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని టూ టౌన్ సీఐ సదాశివయ్య తెలిపారు.