ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన హోమ్ గార్డు బి. శ్రీనివాసులుకు తోటి హోమ్ గార్డులు అండగా నిలిచారు. జిల్లాలోని హోమ్ గార్డులు అందరూ ఒక రోజు వేతనం రూ. 4, 11, 090 సాయం చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రూ. 4, 11, 090 చెక్కును జిల్లా ఎస్పి అశోక్ కుమార్ చేతుల మీదుగా అందచేశారు. రిటరైన హోమ్ గార్డు శ్రీనివాసులు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.