ప్రొద్దుటూరులోని స్థానిక శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారికి పవళింపు సేవ నిర్వహించారు. సాయంత్రం అగస్త్యేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారి పవళింపు సేవను వేద పండితులు శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.